హిందూపురం, న్యూస్ 9, నవంబర్ 26:
27,28 కార్మిక, రైతు “మహా ధర్నా జయప్రదం కొరుకు హిందూపురం నుండి దాదాపు 50 మంది కార్యకర్తలు విజయవాడ బయలుదేరినట్లు ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశేట్టిపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం నెలకు 26వేలు నిర్ణయించి అమలు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఏఐటియుసి పట్టణ ఉపాధ్యక్షురాలు నాగలక్ష్మి, శారద, పరహాన, ఐషా, ఆంజనేయులు, అనిల్ కుమార్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రాజెక్ట్ నాయకురాలు సునీత, దేవి తదితరులు విజయవాడ పోవటం జరిగింది.