Headlines

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా యాడికి మండల కేంద్రంలోని యాడికి మండలంలోని ఆటో డ్రైవర్లకు మరియు టాక్సీ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి సూచనలు చేయడం జరిగింది…

న్యూస్.9యాడికి గ్రామంలో

ఈ దినము రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా

యాడికి మండల కేంద్రంలోని యాడికి మండలంలోని ఆటో డ్రైవర్లకు , మరియు టాక్సీ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి సూచనలు చేయడం జరిగింది…

ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని

ఆటోలో డ్రైవర్ సీట్ పక్కనే ఉండే ఎక్స్ట్రా సీట్లు రిమూవ్ చేయవలెనని

డ్రైవింగ్ చేసేటప్పుడు డెక్కులు పెట్టుకుని ఎక్కువ సౌండ్ పెట్టుకొని ఆటో తోల వద్దని

ఓవర్ స్పీడ్ తో వెళ్ళవద్దని

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని

అందరూ కూడా లైసెన్సు, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ లాంటి అన్ని రికార్డ్స్ కలిగి ఉండాలని

ఆటోలో ఎక్కించుకునే మహిళల పట్ల అమ్మాయిల పట్ల మర్యాదగా వ్యవహరించవలెనని

అలాగే auto డ్రైవర్లు స్పీడు తక్కువగా పోవాలని, ఓవర్ లోడ్ వేసుకోవద్దని చెప్పడం జరిగింది

 

మండలంలో ఆటోల కారణంగా ఒక్క యాక్సిడెంట్ కానీ ,ఒక ప్రాణం గానీ పోకూడదని దానికి అందరూ సహకరించవలెనని కోరడం జరిగింది..

 

Si Yadiki PS