Headlines

రాష్ట్రములో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తాం..!!!

న్యూస్ 9:-వైజాగ్ ) రాష్టంలో జర్నలిస్ట్ల సమస్యలను ప్రభుత్వనికి తెలిసేలా తెలియజేస్తాం అని జాతీయ జరలిస్ట్ల కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు గంట్లా. శ్రీనుబాబు తెలిపారు. గురువారం విశాఖ పౌర గ్రంధాలయం లో నిర్వహించిన ఏ. పి. బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అర్బన్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.2014 -2019 సంవత్సరంలో టిడ్కో ఇల్లు కేటాయించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి ఇప్పటి వరకు తగు చర్యలు తీసుకోలేదు అని. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక. మూడు సెంట్లు భూమి అర్హులైన జర్నలిస్తులకు ఇస్తాము అని హామీలు ఇచ్చి, దరఖాస్తు స్వీకరించిడం జరిగింది. అయినా ఎటువంటి న్యాయం జరగలేదు. నేటికీ జరలిస్ట్ ఇల్లు కల, కలగానే ఉంది ఈ సమస్యలును ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తాం.త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. నారా. చంద్రబాబు, మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ క ళ్యాణ్ లను కలిసి సమస్యలు పరిష్కారనికి తగు చర్యలు తీసుకుంటాం అని ఆయన తెలిపారు.