న్యూస్ 9 రిపోర్టర్ ముత్తారం
పెద్దపల్లి జిల్లా :ముత్తారం మండల కేంద్రంకు చెందిన మోహన్ రెడ్డి శకుంతల దంపతులకు కరుణరెడ్డి రెండో సంతానం.మొదటి కూతురు కూడా అరుణ రెడ్డి ప్రభుత్య ఉద్యోగమే ఆమె ప్రస్తుతం కరీంనగర్ రూరల్ లో మిషన్ భగీరథలో ఏ ఈ గా విధులు నిర్వహిస్తున్నది. కట్ల కరుణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఏఈఈ ఉద్యోగం కు ఎంపికైనది. ప్రస్తుతం ఆమె నాగపూర్ ఆర్ అండ్ బీ లో జూనియర్ ఇంజనీరుగా విధులు నిర్వహిస్తుంది. అమ్మ నాన,సోదరి ప్రోత్సహం తోనే తాను ఈ ఉద్యోగం ను సాధించినట్లు కరుణ రెడ్డి తెలిపారు.ఏ ఈ ఈ గా ఉద్యోగం సాధించిన ఆమెను గ్రామస్తులు అభినందించారు. తమ ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండటం తో వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేసారు.