న్యూస్ 9 రిపోర్టర్ రామగిరి ..మెరుగు. రవి
పెద్దపల్లి జిల్లా : రామగిరి మండలం లోని బుధవారం పేట గ్రామంలో తల్లి పాల వారోత్సవాలు, అన్న ప్రసన్న కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తాజా మాజి ఎంపిపి దేవక్క కొమురయ్య గౌడ్ పాల్గొనిమాట్లాడుతూ నావజాత శిశువలకు తల్లిపాలే అమృతమని, తల్లీబిడ్డల శ్రేయస్సుకు తల్లి పాలు వినియోగం ఎంత అవసరమో, పుట్టిన బిడ్డకు మొదటి గంట లోపే ముర్రు పాలు అమృతం లాంటివాని, మొదటి ఆరు నెలలు తల్లి పాలు శ్రేష్టమని అన్నారు. డబ్బాపాలు వద్దు తల్లి పాలు ముద్దు అనే నినాదం తో ముందుకు పోవాలని మాజి ఎంపిపి దేవక్క అన్నారు. అదేవిధంగా ఆరు నెలలు పాపలకు అన్న ప్రసన్న కార్యక్రమం, గర్భిణీలా బరువులు, ఎత్తులు చూడటం జరిగినది. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్ శ్రీదేవి, మాదవి, ఆశ వర్కర్ భారతి,గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.