Headlines

మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్: కోయ శ్రీహర్ష…

న్యూస్ 9 రిపోర్టర్ మంథని

….. చేరాల. రవీందర్ 9640420733

పెద్దపల్లి జిల్లా :మంథని పట్టణం లో గల 50 పడకల మాత శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని బుధవారం నాడు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి, రోగుల బంధువు లతో మాట్లాడి సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి లో ప్రసవలు పెంచాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు సూచించారు. ఆసుపత్రి తనిఖీ లో గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి, హెడ్ సిస్టర్ యాదమ్మ, ల్యాబ్ టెక్నిషన్స్ పులి ప్రవీణ్ కుమార్, పుప్పాల నితీష్ కుమారు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.