Headlines

పంటను తొలగించిన దుండగులు..

న్యూస్.9) యాడికి

కంది, సజ్జ పంటను తొలగించిన దుండగులు

యాడికి:వీరన్నపల్లి గ్రామానికి చెందిన కంబగిరి స్వామికి చెందిన పొలంలో కంది, సజ్జ పంటలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించిన సంఘటన గురువారం జరిగింది. భాధిత రైతు కంబగిరి స్వామి తెలిపిన వివరాల మేరకు సర్వే నెంబర్ 273-1లో తనకు నాలుగు ఎకరాల పొలం ఉందని తెలిపారు. ఖరీప్ లో కంది, సజ్జ పంటను సాగు చేశానని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో నాలుగు చోట్ల రెండు, రెండు సాళ్ళు ప్రకారం మొత్తం 08సాళ్ళలో పంటను తొలగించారని తెలిపారు.ఈ సంఘటనలో రూ. 10వేల రూపాయల దాకా పంట నష్టపోయినట్లు రైతు తెలిపాడు.అప్పులు చేసి పంటలు సాగు చేసుకున్నానని, దుండగులు పంటను దున్నేసి నష్టపరచడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతు కంబగిరి స్వామి తెలిపారు.