Headlines

ఆర్ఎంపీ వైద్యం వికటించి ముంజ లక్ష్మయ్య మృతి….

న్యూస్ 9 రిపోర్టర్ మంథని,

పెద్దపల్లి, కరీంనగర్…

చేరాల. రవీందర్

….9640 420 733

శంకరపట్నం మండలం మెట్పల్లికి చెందిన ముంజ లక్ష్మయ్య ఈ నెల 5 న స్థానిక ఆర్ ఏం పి దగ్గరకు విరోచనాలు అవుతున్నాయని మాధవరాజు కు చెందిన మధు క్లినిక్ కు పోయారు. ఆర్ ఏం పి పరిశీలించి ఐవీ ఫ్లూడ్స్ పెట్టడం తో పాటు దానిలో రెండు ఆంటిబయోటిక్ ఇంజక్షన్ లు ఇచ్చినట్లు తెలిపారు. దీనితో లక్ష్మయ్య కు విపరీతంగా చలి రావడం తో పాలు తాగితే తగ్గిపోతుందని చెప్పి అతడు ఇంటికి పంపించాడు. ఐనా చలి తగ్గక పోవడం తో మరో రెండు ఇంజక్షన్ లు ఇచ్చాడని, ఆ తరువాత బాధితుడు కోమాలోకి వెళ్లడం తో వెంటనే హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కీ తీసుక వెళ్ళమని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ నుండి హన్మకొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ముంజ లక్ష్మయ్య మృతి చెందినట్లు కేశవపట్నం SI రవి తెలిపారు.