Headlines

విజన్ స్కూల్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం..

న్యూస్. 9)

యాడికి మండల కేంద్రంలో ఉన్న ఉన్న విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా తెలుగు భాషా దినోత్సవం ను నిర్వహించడం జరిగింది..గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవం ను జరుపుకుంటున్నందున విజన్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి టెంకాయ సమర్పించి నివాళులు అర్పించారు…తదుపరి తెలుగు పద్యాలు,పాటలు,కవులు వారి రచనల గురించి చర్చ, తెలుగులో వక్తృత్వ పోటీలు, పరమానందయ్య శిష్యుల కథలు మొదలైన అనేక కార్యక్రమాలను విద్యార్థుల చే నిర్వహించడం జరిగింది…విజన్ విద్యా సంస్థల కరస్పాండెంట్ విశ్వనాథ్ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి తెలుగు వ్యవహారిక భాష కొరకు ఎంతో శ్రమించారని,తెలుగు సాహిత్యానికి ఎంతో చేశారని,అలాగే తెలుగు సాహితీ చరిత్ర గురించి వివరిస్తూ స్త్రీల కోకిల కంఠములలో,కర్షక శ్రామిక స్వేదములో,తెలుగు పండుగలలో తెలుగు సాహిత్యం మరియు గొప్పదనం గురించి తెలుస్తుందని, మాతృదేవి,మాతృ భూమి,మాతృ భాష ఈ మూడింటి ఔన్నత్యం, మాతృ శబ్దం వింటే మనసు పులకిస్తుందని “దేశ భాష లందు తెలుగు లెస్స” అని వివరించారు…అలాగే వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది…తదుపరి తెలుగు ఉపాధ్యాయుడు ఓంకార్ ని సన్మానించడం జరిగింది… ఈ కార్యక్రమంలో విజన్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.