Headlines

అగాపే ఆశ్రమంలో వృద్ధుల దినోత్సవం..

న్యూస్.9)

యాడికి మండల కేంద్రంలోనికమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఫౌండర్ ప్రసాద్ ఆశ్రమంలో వృద్ధుల చేత కేక్ కట్ చేయించి వారికి మిఠాయిలు తినిపించి వారి నోటిని తీపి చేశారు. వారికి మంచి ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఈలాంటి ప్రపంచ వృద్ధుల దినోత్సవాలు ఆశ్రమంలో ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను అన్నారు. వృద్ధులకు అండగా ఉండకుండా కన్న కొడుకులు కూతుళ్లు పట్టించుకోని నేటి తరంలో వారికి ఆశ్రయమిచ్చి నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు అగాపే ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్ ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులను సంతోషపరిచారు.