న్యూస్.9)
యాడికి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కబడ్డీ అండర్ -14 విభాగంలో యాడికి స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ విద్యార్థి మణికిశోర్ ఎంపికైనట్లు పాఠశాల మేనేజ్ మెంట్ నాగేంద్ర తెలిపారు. మంగళవారం తాడిపత్రిలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి కబడ్డీ పోటీలలో మణి కిషోర్ మంచి ప్రతిభను కనపరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన మణి కిషోర్ ను పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.