న్యూస్ 9) యాడికి
చేనేత వస్త్రాలను ధరించండి – నేతన్నని కాపాడుకుందాం.
యాడికి మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయం తి సందర్భంగా జాతీయ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పట్టు పోగులతో మాల చేసి,పూలమాల వేయడం జరిగింది. అనంతరం చేనేత కార్మికులకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగినది . గాంధీజీ జయంతి సందర్భంగా జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం అనంతపురం పార్లమెంట్ కన్వీనర్ మామిల్ల నారాయణస్వామి మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలోని పోరు బందర్ లో జన్మించారు. మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి భారతజాతిని ఏకం చేయడానికి గాంధీజీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమ ,సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, శాంతి అహింస పద్ధతుల ద్వారానే మన దేశానికి స్వాతంత్రం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. అందుకోసం భారత జాతిని ఏకం చేయడం కోసం భారతదేశంలోని నాటి 35 కోట్ల జనాభాలో 20 శాతం ఉన్న ఐదు కోట్ల మంది చేనేత కార్మికులను కలుపుకొని ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను ధరించండి అనే నినాదంతో భారత జాతిని ఏకం చేయడం జరిగింది. ఆనాటి రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో మగ్గం వాటు రోకలి పోటు లేని గ్రామం గాని పట్టణం గాని ఉండేవి కావు. అందుకే ఈ స్వదేశీ ఉద్యమం ద్వారా ఏకం చేసి మన దేశానికి స్వతంత్రం రావడానికి కారణమైంది.
నాటి నుండి నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ప్రస్తుతం చేనేత కార్మికులు అందరూ కూడా మాస్టర్ వీవర్స్ చేతిలో నలిగిపోతున్నారు వారిచ్చిందే కూలి వారు చెల్లించేదే వేతనం. కాబట్టి మాస్టర్ వీవర్స్ తగ్గించిన చీరలు కూలి రేట్లు అని పెంచాలని మాస్టర్ వీవర్స్ కు మంచి బు ద్దీ ప్రసాదించాలని జాతిపిత మహాత్మా గాంధీని వేడుకుంటున్నాము. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలకు బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాలలో చేనేతలకు సంక్షేమానికి కృషి చేయడం జరిగినది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి పాదయాత్రలో చేనేత కార్మికులకు అనుబంధ కార్మికులకు నేతన్న నేస్తం 30 వేల రూపాయలు, ఉచిత విద్యుత్తు 200యూనిట్లు అమలు చేస్తానని , చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తానని నేత బజార్లు ఏర్పాటు చేస్తానని, చేనేత కార్మికుల ముడి సరుకు కు పట్టు నూలు రాయితీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తానని 90% సబ్సిడీతో మగ్గం పరికరాలను అందజేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సతీమణి నారా భువనేశ్వరి దేవి గారు కూడా మీడియా ద్వారా తెలుగు రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా దసరా ఇతరా పండుగల సందర్భంగ
చేనేత వస్త్రాలు అందరించండి చేనేత కార్మికులను ఆదుకోండి అని చెప్పడం జరిగింది కావున ప్రస్తుత ప్రభుత్వం చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని జాతీయ చేనేత ఐక్యవేదిక కన్వీనర్ మామిళ్ళ నారాయణస్వామి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ చేనేత ఐక్యవేదిక తాడిపత్రి ఇంచార్జ్ వేల్పుల మల్లికార్జున, జిల్లా ఉపాధ్యక్షుడు పొట్లూరు నరసింహయ్య, పప్పు వెంకటేష్, హాజీపీరా, పామిశెట్టి గోపీనాథ్, లెజెండ్ వెంకటస్వామి, ఆంజనేయులు, కుల్లాయ రెడ్డి, రామాంజనేయులు, ఉక్కిసల లక్ష్మీనారాయణ,మధు ఆచారి, బోనాల తిరుపతయ్య,