Headlines

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ యాత్ర చేయబోతున్న బస్సు రెడీ అయింది. జనసేనాని యాత్ర చేయబోతున్న బస్సుకి వారాహి అని పేరు పెట్టారు. వారాహికి రకరకాల అర్థాలు ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజమౌళికి సన్నిహితుడైన సాయి కొర్రపాటి ప్రొడక్షన్ పేరు వారాహి చలన చిత్ర ఆయన పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే.

బాలకృష్ణకు అభిమాని అవ్వడంతో పాటు తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడిగా చాలా కాలంగా సాయి కొర్రపాటి వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఆయనే జనసేనాని కోసం ఈ బస్సును రెడీ చేయించాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ బస్సుకు సంబంధించిన అన్ని బడ్జెట్ అవసరాలను సాయి కొర్రపాటి సమకూర్చారని.. దీన్ని బట్టి జనసేనానికి వెనక ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ సపోర్టుగా నిలుస్తుందని వార్తలు వస్తున్నాయి. భారత ఆర్మీ రంగానికి చెందిన వాహనాల రంగులో వారాహి ఉంది కనుక ఈ వాహనం యొక్క రంగును తక్షణ మార్చాలి అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి రంగు ఉన్న వాహనాలను ఎలా ఆర్టిఏ రిజిస్టర్ చేస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.