మరో రకంగా బాదుడు మొదలెట్టనున్న ఆపిల్

 మరో రకంగా బాదుడు మొదలెట్టనున్న ఆపిల్

ఆపిల్ ఒక షాక్ ఇచ్చింది.. ఇకనుంచి ఫోన్ కొనే వారికి చార్జర్ రాదని.ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ కొంటే బాక్సులో హెడ్‌ఫోన్స్ కూడా వచ్చేవి.ఖర్చు తగ్గించుకోవడం కోసం కంపెనీలు హెడ్‌ఫోన్స్ ఇవ్వడం ఆపేశాయి. ఇప్పుడు మీరు ఏ స్మార్ట్‌ఫోన్ కొన్నా ఛార్జర్ అడాప్టర్, కేబుల్ మాత్రమే ఉంటాయి. కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కేస్‌లు ఇస్తున్నాయి. ఒకట్రెండు స్మార్ట్‌ఫోన్లకు మాత్రం హెడ్‌ఫోన్స్ వస్తున్నాయి. త్వరలో స్మార్ట్‌ఫోన్ కొంటే బాక్సులో ఫోన్ తప్ప ఇంకేమీ ఉండకపోవచ్చు.

ప్రొడక్షన్ కాస్ట్‌తో పాటు ఈ వేస్ట్ తగ్గించేందుకు యాపిల్, సాంసంగ్ లాంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోబోతున్నాయి. యాపిల్ ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్లు కొంటే వాటితోపాటు ఛార్జర్ రాకపోవచ్చు. సాంసంగ్ కూడా ఇదే ఆలోచన చేస్తోంది.

అంతేకాదు… ఇప్పటికే కస్టమర్ల దగ్గర ఛార్జర్లు ఉన్నట్టయితే వాటి కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పాత ఛార్జర్ ఉపయోగించొచ్చు. అందుకే బాక్సులో ఛార్జర్ ఇవ్వొద్దన్న ఆలోచన చేస్తున్నట్టున్నాయి. ప్రస్తుతానికి యాపిల్, సాంసంగ్ లాంటి బడా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఛార్జర్ ఇవ్వకూడదన్న దిశగా ఆలోచిస్తున్నాయి. అదే జరిగితే మిగతా కంపెనీలు కూడా ఛార్జర్ లేకుండా స్మార్ట్‌ఫోన్లు అమ్మొచ్చు. ఛార్జర్ లేకుండా ఫోన్లు అమ్ముతారు కాబట్టి స్మార్ట్‌ఫోన్ రేటు కూడా తగ్గే అవకాశం ఉంది.

Related post