పివి సింధు రాఖి శుభాకాంక్షలు ఎవరికీ చెప్పిందో తెలుసా ?

 పివి సింధు రాఖి శుభాకాంక్షలు ఎవరికీ చెప్పిందో తెలుసా ?


న్యూ ఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సోమవారం ప్రధాని నరేంద్రమోడీకి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపింది. తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. ‘గుడ్‌ ఈవ్‌నింగ్‌ సార్‌.. ఈ శుభ దినోత్సవాన మీకు నేను రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నా. మీరు దేశం కోసం ఎంతో చేస్తున్నారు. మీకు కృతజ్ఞతలు.’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ‘హ్యాపీ రక్షా బంధన్ @ పీఎంఓఇండియా సర్’ అని శీర్షిక పెట్టింది. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఈ సమయానికి మీకు బహుమతిగా ఇస్తా అని పేర్కొంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, 2020 టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

Related post