సౌరవ్ గంగూలీ బొయోపిక్ లో హృతిక్

 సౌరవ్ గంగూలీ బొయోపిక్ లో హృతిక్


లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్ .. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ వెండితెరకెక్కనుందా? అంటే గత కొంతకాలంగా దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పలువురు దర్శకులు సౌరవ్ జీవితకథను స్క్రిప్టుగా మారుస్తున్నారని కూడా బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపించాయి.తాజాగా ఇదే ప్రశ్న నేహా ధూపియా టీవీ షోలో సౌరవ్ కి ఎదురైంది. హృతిక్ రోషన్ ఈ సినిమాని ప్రారంభించే ముందు తనలాంటి శరీరాన్ని పొందవలసి ఉంటుందని చెప్పారు. తన బయోపిక్ లో ఏ బాలీవుడ్ నటుడిని చూడాలనుకుంటున్నారో ఓపెనయ్యాడు దాదా. హృతిక్ రోషన్ ఆ పాత్రను పోషించగలరా అని నేహా ధూపియా అడగ్గా.. ఆ కండల రూపం మారితే సాధ్యమేనని అన్నారు. సౌరవ్ గంగూలీ తన కుమార్తె సనాను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం గురించి కూడా మాట్లాడారు. ట్రోలర్స్ కి తన కుమార్తె సరైన సమాధానం చెబుతుందని అన్నారు గంగూలీ.


కొన్ని నెలల క్రితం కరణ్ జోహార్ సౌరవ్ గంగూలీ బయోపిక్ చేయాలని భావిస్తోందని పుకార్లు వచ్చాయి. అందులో హృతిక్ రోషన్ నటిస్తారని కూడా ప్రచారమైంది. ఏక్తా కపూర్ నిర్మాత అని చెప్పుకున్నారు. మాజీ కెప్టెన్ గంగూలీ ఓ ఎంటర్ టైన్మెంట్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏక్తా కపూర్ తనను సంప్రదించిందని దాని గురించి ఒకసారి మాట్లాడామని తెలిపారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

Related post