దేశ వ్యాప్తంగా పలు చోట్ల 144 సెక్షన్

 దేశ వ్యాప్తంగా పలు చోట్ల 144 సెక్షన్

 రాయ్‌పూర్‌లో రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ జిల్లా యంత్రాంగం సెప్టెంబర్ 21(సోమవారం) రాత్రి 9గంటల నుంచి సెప్టెంబర్ 28 అర్ధరాత్రి వరకు వారంపాటు లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. కలెక్టర్ ఎస్ భారతీదాసన్ 2020 సెప్టెంబర్ 19 నాటి నోటీసులో జిల్లాను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

‘రాయ్‌పూర్‌లో ఇప్పటివరకు 26,000 కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.ప్రతిరోజూ 900-1000 పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అందువల్ల రాయ్‌పూర్ జిల్లాను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించాం.’ అని నోటీసులో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కిరాణా షాపులు, వాణిజ్య దుకాణాలు, కూరగాయల మార్కెట్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ షాపులు, పెట్రోల్‌ పంపులు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ఎల్పీజీ సిలిండర్ డోర్‌డెలివరీకి కూడా అనుమతి ఉందని తెలిపారు. అలాగే, ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్, ప్రైవేట్ సహా అన్ని కార్యాలయాలు మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతర్‌ జిల్లా సరిహద్దును మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారికి ఐసీసీ 1860, 188 కింద శిక్ష పడుతుందని ఉత్తర్వులో పేర్కొన్నారు.

Related post