Headlines

ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్లను వంటేరు ప్రతాపరెడ్డికి అప్పగించిన నూనె కుమార్

 

ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కొండపాక మండలానికి చెందిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం సేకరించిన 1300 అప్లికేషన్ ఫారాలను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి గారికి కొండపాక మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గార్ల ఆలోచన విధానంతో యువతి యువకులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్సు కోసం నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి హైమద్ కళ్యాణ్కర్ నరసింగరావు, ఏగొండ స్వామి, తుమ్మ శ్రీనివాస్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు…..
.