చెన్నైతో మ్యాచ్‌కు బట్లర్‌ దూరం..రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌

 చెన్నైతో మ్యాచ్‌కు బట్లర్‌ దూరం..రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌

దుబాయ్‌: ఐపీఎల్‌ 13లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తన తొలి మ్యాచ్‌లో ఈనెల 22న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. సీజన్‌లో రాజస్థాన్‌ ఆడే తొలి మ్యాచ్‌కు ఇంగ్లాండ్‌కు చెందిన వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ సెలక్షన్‌కు అందుబాటులో ఉండట్లేదు.

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత ఇరు జట్లకు చెందిన 21 మంది ఆటగాళ్లు గత గురువారం రాత్రి యూఏఈ చేరుకున్నారు. నిబంధనల ప్రకారం 36గంటల క్వారంటైన్‌ను కూడా పూర్తి చేసుకొని తాము ప్రాతినిధ్యం వహించాల్సిన జట్లతో చేరిపోయారు. తన క్వారంటైన్‌ పూర్తికాకపోవడంతో చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌ను మిస్‌ అవుతున్నట్లు బట్లర్ తెలిపాడు.
‘నేను క్వారంటైన్‌లో ఉంటున్నందున, దురదృష్టవశాత్తు రాజస్థాన్‌ ఆడే తొలి మ్యాచ్‌కు నేను అందుబాటులో ఉండటం లేదు. నేను నా కుటుంబంతో ఇక్కడ ఉన్నాను. నా ఫ్యామిలీతో కలిసి ఉండటానికి రాయల్స్‌ ఫ్రాంఛైజీ అనుమతించింది. ఇది నాకెంతో సహాయపడుతుందని’ చేసిన వీడియోలో బట్లర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Related post