Headlines

జిల్లాలో విజయవంతంగా జగనన్న సురక్ష : జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, జూలై 23:

జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, కార్యక్రమంలో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న 11 రకాల సర్టిఫికెట్లలో ప్రజలు కోరుకున్న సర్టిఫికెట్లను సకాలంలో అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో ఈనెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 476 సచివాలయాల పరిధిలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలలో 4,52,675 సర్వీసులకు నమోదు చేయగా, 4,44,787 సేవలు అందజేసినట్లు, 499 అర్జీలు సరైన ఆధారాలు లేనందున తిరస్కరించినట్లు తెలిపారు. అలాగే 7,389 సేవలు అధికారుల పరిశీలనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. జూలై 1 నుంచి 22వ తేదీ వరకు జిల్లాలో జరిగిన జగనన్న సురక్ష శిబిరాల్లో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు 1,66,031, ఆదాయ దృవీకరణ సర్టిఫికెట్లు 1,62,364, ఆధార్ కు మొబైల్ నెంబర్ అప్డేషన్ 5,168, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు 325, కొత్త రేషన్ కార్డులు, రైస్ కార్డుల స్పిట్టింగ్ కు 1,924, మ్యూటేషన్లు 204, హౌస్ హోల్డ్ నుంచి వివాహమైన వారిని వేరు చేయుటకు 297, వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్లు 93, సిసిఆర్ కార్డులు 5,270, జనన ధ్రువీకరణ పత్రాలు 297, మరణ ధ్రువీకరణ పత్రాలు 377 జారీ చేసినట్లు తెలిపారు. వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను సచివాలయాల ద్వారా సకాలంలో అందిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేని, అర్హత లేని సర్టిఫికెట్లను విచారించి అర్హత ఉంటే అందిస్తున్నామని, లేకపోతే లబ్ధిదారుడికి కారణాలు చెప్పి తిరస్కరిస్తున్నట్లు ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈనెల చివరి వరకు జరిగే సురక్ష శిబిరాల్లో 11 రకాల సర్టిఫికెట్లను అందించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు ఆమె ఆ ప్రకటనలో వివరించారు.