• October 21, 2020

మున్సిపల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి – మందా వెంకటేశ్వర్లు

 మున్సిపల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి – మందా వెంకటేశ్వర్లు

హైకోర్టు తీర్పు అమలు చేస్తూ   మున్సిపల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
– మందా వెంకటేశ్వర్లు మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
—————————————–
సెప్టెంబర్ 21 ఇల్లందు: ప్రజల ప్రాణాల రక్షణ కోసం కరోనాతో పోరాడుతున్న మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కనీస వేతనం రూ.24 వేలుగా నిర్ణయించి చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, సిపిఐ  ఇల్లందు పట్టణ కార్యదర్శి బందం నాగయ్య  డిమాండ్ చేశారు. సోమవారం ఎఐటియుసి జిల్లా కార్యదర్శి దేవరకొండ శంఖర్  ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశం నిర్వహించి మున్సిపల్ అదికారి ఆర్.ఓ. అంగన్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి మున్సిపల్ ( జి.హెచ్. యం.సి) సిబ్బంది 98 మందిని రెగ్యులరైజ్ చేయాలని ఇచ్చిన తీర్పు ఆదేశాలను అనుసరిస్తు చర్యలు చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వానికి చూచనలు చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్  కార్పొరేషన్లు, మున్సిపాలిటిల్లో గ్రేటర్ హైదరాబాద్ తో కలిపి సుమారు 68 వేలమంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ తదితర పద్దతుల్లో పారిశుద్ధ్యం, ఎలక్ట్రికల్, వాటర్ సప్లయ్, గార్డెన్, ఆఫీసు నిర్వహణతో పాటు వివిధ కేటగిరీలలో దీర్ఘకాలంగా గత అనేక సంవత్సరాలుగా వెట్టిచాకిరీతో మగ్గిపోతూ పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్  చేయాలని, కనీస వేతనం రూ 24 వేలుగా పెంచాలని, జి.ఓ.ల ప్రకారం కేటగిరిలవారిగా వేతనాలు అమలు, ఉద్యోగ భద్రత కల్పించేలా కేసీఆర్ ప్రభుత్వం సుమాలోచన చేసి కార్మికులందరికి సమన్యాయం చేయాలని కోరారు. ఆగస్టు 11న హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ నందు పనిచేస్తున్న  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్లను క్రమబద్ధీకరించాలని ఇచ్చిన తీర్పు హర్షించదగిన విషయమని తెలియజేశారు. మున్సిపాలిటిల్లో  ఒకేరకమైన పనులు చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగితోపాటు సమాన పనికి  సమాన వేతనం, ఇతర అలవెన్సులు చెల్లించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని అన్నారు.

Related post