• October 21, 2020

రైతులు కోల్పోతున్న భూమిని వెంటనే రద్దు చేసి తిరిగి రైతులకు ఇవ్వాలి

 రైతులు కోల్పోతున్న భూమిని వెంటనే రద్దు చేసి తిరిగి రైతులకు ఇవ్వాలి

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం :

జిన్నారం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్1 లో రైతులు *కోల్పోతున్న భూమిని వెంటనే రద్దు చేసి తిరిగి రైతులకు భూమి ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని
పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట్ట శ్రీనివాస్ గౌడ్ ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో జిన్నారం రైతులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఓ వినతి పత్రం ఇవ్వడం జరిగింది 

కాట్ట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు నుంచి ప్రభుత్వం లాక్కోవడం అన్యాయమని  కెసిఆర్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ప్రభుత్వం లోకి వచ్చి ఇప్పుడు రైతుల భూమిని లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు గిరిజన దళిత బిడ్డలని మోసం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం నయవంచన చేస్తుందని ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని తెలిపారు గత దశాబ్దాలుగా రైతులు తమ భూములను సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని అలాంటి రైతుల భూమిని లాక్కోవడం ఇండస్ట్రియల్ పార్క్ పేరుచెప్పి రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో జిన్నారం మండలం తాసిల్దార్ కార్యాలయం ముట్టడించి ధర్నా చేస్తామని హెచ్చరించారు ఎట్టి పరిస్థితిలో రైతుల భూములు కోల్పోకుండా చూస్తామని రైతులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో జిన్నారం మండల ఎంపిపి రవీందర్ గౌడ్ వైస్ ఎంపీపీ గంగు రమేష్  సొలక్ పల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే కృష్ణ  శ్రీకాంత్ గౌడ్    రైతులు ఆనంద్ చారి శేఖర్ అశోక్ రాజు గౌడ్ నీలం వెంకటేష్ సంజీవ శ్రీనివాస్ దుర్గయ్య యనగండ్ల నరేందర్ పాల్గొన్నారు

Related post