• October 21, 2020

కొండా లక్ష్మణ్ బాపూజీ 8వ వర్ధంతి

 కొండా లక్ష్మణ్ బాపూజీ 8వ వర్ధంతి
కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో ఈ రోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 8వ వర్థంతిని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షుడు సామల తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమికను పోషించి,రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం వదులుకొన్న తొలితరం ఉద్యమనేత అని, తెలంగాణలో ముల్కి వ్యతిరేక ఉద్యమం మరియు భారత స్వతంత్ర సంగ్రామంలో సైతం పాల్గొన్నారని,సాయిధ రైతాంగ పోరాటంలో ఆయన పాత్ర మరిచిపోలేనిదని,తెలంగాణలో రాష్ట్ర సాధన కోసం పదవిని వదులుకున్న తొలి నేతని,ఆయన సేవలు రాబోయే తరాలకు స్పూర్తి దాయకమని,ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కనుకుట్ల వెంకటేష్,కనుకుట్ల శ్రీనివాస్,సామల రాజన్న,శ్రీరామ బాస్కర్,పర్శ రమేష్,పిసి వెంకటేష్,
జావీద్ అలీ,సుధాకర్ గౌడ్,దిగంబర్ పాల్గొన్నారు.

Related post