కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై …. కార్మిక సంఘాల నిరసన.

 కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై …. కార్మిక సంఘాల నిరసన.

కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త నిరసనకు
మద్దతుగా ఎమ్మిగనూరు పట్టణంలో సి ఐ టి యు, ఏ ఐ టి యు సి, ఐ ఎఫ్ టి యు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లోని బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై
నిరంకుశంగా వ్యవహరిస్తూ, కార్మికుల చట్టాలను కాలరాస్తూ, ఇష్టానుసారంగా ప్రైవేటు రంగం బిల్లు తెచ్చి కార్మికులకు తీవ్ర ద్రోహం చేస్తుందని విమర్శించారు. రైల్వే శాఖ, విమానయాన శాఖ, తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని విమర్శించారు. అలాగే కరోనా కష్టకాలంలో కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు ఆకలి చావులు చస్తూ ఉంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రం వారికి జీతాలు ఇవ్వక, జీతాలు పెంచక, వచ్చిన జీతాల్లో కూడా కోతలు విధిస్తూ అసలు వారి ఉపాధికే ఎసరు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం మతతత్వ పార్టీ అని, కార్మికుల హక్కులను కాలరాయడం 44 చట్టాలు ఉన్నా, నాలుగు చట్టాలుగా మార్చిందని, విమర్శిస్తూ
పార్లమెంటులో కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు ను పాస్ చేయడానికి వెనకాడకుండా ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. అప్రజాస్వామిక పద్ధతుల్లో కార్మిక చట్టాలను కాలరాస్తే ఊరుకునేది లేదని, అప్రజాస్వామిక బిల్లులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేదంటే ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్

Related post