Headlines

విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అప్పాజీ పై విచారణ చేయాలి

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జులై 31:

విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతు, ఇబ్బందులకు గురి చేస్తున్న నన్నయ యూనివర్సిటీలో అధ్యాపకుడు గా పని చేస్తున్న అప్పాజీ పై విచారణ చేయాలని బహుజనసేన రాష్ట్ర సమన్వయకర్త గుంపుల సత్య కృష్ణ ఆరోపిస్తూ డిమాండ్ చేశారు. సోమవారం తాడేపల్లిగూడెంలోని నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీ క్యాంపస్ లో ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిపై సమాధానం చెప్పేవారు ఇక్కడ లేకపోవడం శోచనీయం అన్నారు .ఈ క్యాంపస్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ బోధకుడు అప్పాజీ ప్రవర్తన అక్కడ విద్యార్థినిలకు ఇబ్బందికరంగా మారిందని తెలిపారు .ఇటీవల భీమడోలు లో జరిగిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డమే కాకుండా పలువురు విద్యార్థినిలుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సత్య కృష్ణ ఆరోపించారు . దీనిపై వివరణ అడగడానికి వెళ్లిన ఇక్కడ ప్రిన్సిపల్ లేకపోవడం అనుమానం వ్యక్తం అవుతుంది అన్నారు .అంతేకాకుండా అప్పాజీ ఇప్పటివరకు కళాశాలకు రాకుండా సెలవులో ఉండడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019-2021,2020-2022 సంవత్సరంలో చదివిన విద్యార్థినిలు అప్పాజీ చేసిన లైంగిక వేధింపులను తనకు ఫోన్ ద్వారా తెలియజేశారని అవసరమైతే తామే వచ్చి విచారణలో పాల్గొంటామని తెలిపారుఅని సత్య కృష్ణ చెప్పారు .తప్పు చేసిన అప్పాజీ తన నిజాయితీని నిరూపించుకోవాలని ఎందుకు సెలవు పెట్టుకుని దాకుంటున్నారని నిలదీశారు. ప్రాక్టికల్స్ ప్రాజెక్ట్స్ లలో మార్కులు తగ్గిపోతాయని భయంతో ఇంతవరకు చెప్పలేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు అప్పాజీ బాధితులను పరోక్షంగా ప్రత్యక్షంగా వేధింపులకు గురి చేస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజకీయంగా ఒత్తిడి తెస్తున్నారని సత్య కృష్ణ తెలిపారు .అప్పాజీ పై యూనివర్సిటీ అధికారులు విచారణ చేయాలని ఆయన చేసిన అకృత్యాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు అప్పాజీపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు .ఇప్పటికైనా యూనివర్సిటీ ప్రిన్సిపల్ యూనివర్సిటీ అధికారులు స్థానిక పోలీసులు స్పందించి తాడేపల్లిగూడెంలోని నన్నయ్య యూనివర్సిటీలో అప్పాజీ చేస్తున్న ఆకృత్యాలను లైంగిక వేధింపులను అరికట్టి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సత్య కృష్ణ డిమాండ్ చేశారు.