• November 29, 2021

దేశంలో పండగల సీజన్ ప్రారంభం : 200 ప్రత్యేక రైళ్లు

 దేశంలో పండగల సీజన్ ప్రారంభం : 200 ప్రత్యేక రైళ్లు

దేశంలో పండగల సీజన్ ప్రారంభం కానుండటంతో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైందని భారతీయ రైల్వే. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 200 ప్రత్యేక రైళ్లు నడపున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.

కరోనా కారణంగా మార్చి 22 నుంచి సాధారణ ప్రయాణికుల రైళ్లు నడపడం లేదు. తాజాగా, పండగ సెలవుల దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో కరోనా సమస్య తక్కువగా ఉంటే 200 కంటే ఎక్కువ రైళ్లనే నడుపుతామని వీకే యాదవ్ పేర్కొన్నారు.

కాగా, గత ఆరు నెలలుగా కరోనా లాక్‌డౌన్ కారణంగా రైల్వే సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, వలస కార్మికులను వారి సొంత గ్రామాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడిపిన విషయం తెలిసిందే. అన్‌లాక్ ఇప్పటికే దాదాపు అన్ని కార్యకలాపాలకు ప్రారంభమవుతున్నాయి.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 65,87,262 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. 9,40,969 యాక్టివ్ కేసులున్నాయి. 55,43,213 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,02,157 మంది కరోనా సోకి మరణించారు.

Related post