• November 29, 2021

చందుర్తి లో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా రాస్తారోకో.

 చందుర్తి లో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా రాస్తారోకో.
  • చందుర్తి లో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా రాస్తారోకో..
  • ప్రధాని, యూపీ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దగ్ధం..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళ మనీషా పై అతి దారుణంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ చందుర్తి మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు, ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు, సమావేశానికి ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, యువతి అని చూడకుండా అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం చాలా బాధాకరమన్నారు, బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై హత్యాచారాలు హత్యలు పెరుగుతున్నాయని అన్నారు, వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై సుమారు 500 మంది దళితులు రాస్తారోకో చేసే నిరసన చేపట్టారు, ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న తరచు అత్యాచారాలు, హత్యలకు అక్కడి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నారు, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు దుమ్ము ఆనంద్, వైస్ ఎంపీపీ అబ్రహం, బండపల్లి సర్పంచ్ న్యాత విజయజార్జి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దప్పుల అశోక్, బత్తుల కమలాకర్, వేల్పుల దేవ స్వామి, అంజి బాబు. నీరటి శ్రీనివాస్, చంటిప్రసాద్, మల్లారపు రాజయ్య, కొమ్ము రమేష్, గిరిజన సంఘం నాయకులు గబ్బర్ సింగ్ తో పాటు వివిధ గ్రామాలకు చెందిన పెద్ద ఎత్తున దళితులు పాల్గొన్నారు.

Related post