Headlines

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన – నూనె కుమార్

 

మండల పరిధిలోని ప్రజలకు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావానికి నిలువెత్తు నిదర్శనమే రాఖీ పౌర్ణమి అని అన్నారు. భార‌తీయ సంస్కృతి, సాంప్ర‌దాయాల్లో గొప్ప ఆచారమ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య సోద‌ర‌భావం మ‌రింత‌గా విరజిల్లాలని నూనె కుమార్ ఆకాంక్షించారు. సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.