రాజీవ్ గృహకల్ప త్వరలోనే ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా…

 రాజీవ్ గృహకల్ప త్వరలోనే ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా…

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప త్వరలోనే ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా మారనుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ అన్నారు. రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వంత నిధులతో నిర్మిస్తున్న సాయిబాబా, మార్కండేయ, సంతాన నాగదేవత ఆలయాలకు శుక్రవారం వేధమంత్రోచ్ఛరణల మధ్య రాగం సుజాతనాగేందర్ యాదవ్ దంపతులు ధ్వార బంధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ రాజీవ్ గృహకల్పలో ఇది వరకు చిన్నగా ఉన్న సాయిబాబా మందిరం ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సాయిబాబా మందిరంతో పాటు మార్కండేయ ఆలయం, సంతాన నాగదేవత ఆలయాన్ని నిర్మించి ఇక్కడి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడం జరుగుతుందన్నారు. సాయినాథుని ఆశీస్సులతో ఇంతటి పుణ్యకార్యం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్ రావు, మేడ్చల్ కౌన్సిలర్ మధుకర్ యాదవ్, వార్డు మెంబర్లు శ్రీకళ, పొడుగు రాంబాబు, రాగం కృష్ణ యాదవ్, రాగం శ్రీనివాస్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు బసవయ్య, భూదేవి, సరిత, శ్రీనివాస్ తో పాటు బద్దం కొండల్ రెడ్డి, చంద్రకళ, భాగ్యలక్ష్మీ, ఝాన్సీ, జయమ్మ, కుమారి, కళ్యాణి, శశికళ, సుజాత, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజు, గోపీనగర్ టీఆర్ఎస్ పార్టీ బస్తీ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్, రవీంద్ర రాథోడ్, సురేష్, నర్సింలు, నాగరాజు, శివనారాయణ, అంజయ్య, సుశీల,‌ విజయలక్ష్మి ,‌లక్ష్మమ్మ, తదితరులు ఉన్నారు.

Related post