శివనంది అవార్డు అందుకున్న రిపోర్టర్ హరికృష్ణ

 శివనంది అవార్డు అందుకున్న రిపోర్టర్ హరికృష్ణ

పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలంలోని వినాయక నగర్ కు చెందిన హరికృష్ణకు జాతీయ శివనంది అవార్డు ప్రధానం చేయడం జరిగింది..
కరోనా వ్యాధి కారణంగా చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా శ్రీ కాళహస్తి నియోజకవర్గంలోని, గంగాసదన్, భరద్వాజ తీర్థం కళా ప్రాంగణం నందు కార్తీక నృత్యాత్సవం జాతీయ పురస్కారాలు అవార్డు నిర్వహించడమైనది..
ఈ సందర్భంగా హరికృష్ణ గారి సేవలను గుర్తించి ప్రైడ్ ఇండియా కల్చరల్ మరియు సిటిజన్ వెల్ఫేర్ ఫారం సంస్థ వారు ఏ. పీ. జే అబ్దుల్ కలాం, దూర్జటి మరియు జాతీయ శివ నంది అవార్డులు ప్రకటించారు కార్యక్రమంలో భాగంగా
గజల్ శ్రీనివాస్ గారు ప్రముఖ జాతీయ సినీ గాయకులు, కండ్రిగ ఉమా గారు బిజెపి రాష్ట్ర సెక్రెటరీ, సీతా మహాలక్ష్మి డబ్ల్యూ. హెచ్. ఆర్. సి డిప్యూటీ చైర్మన్, నీరజా చందన్ , , శ్రీకాళహస్తి ఆలయ ఈ.వో. పెద్దిరాజు, కళాభారతి ఫౌండేషన్ అధినేత డాక్టర్. రఘుపతి గారు, వారి చేతుల మీదుగా పూలమాలలతో శివ నంది అవార్డు స్వీకరించారు
ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయస్థాయిలో ప్రతి రాష్ట్రం నుండి తరలి వచ్చిన కళాకారులు, ముఖ్య అతిధులు మరియు బాల నృత్యా కళాకారులు పాల్గొన్నారు..

Related post