Headlines

వెబ్ ఆప్షన్స్ లో నన్నయ బీఫార్మసీ కోర్సును ఎంపిక చేసుకోండి: వీసీ ఆచార్య కె పద్మరాజు..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 22 :

ఏపీ ఇఎపి సెట్ బైపీసీ విభాగము వెబ్ ఆప్షన్స్ లో ఆదికవి నన్నయ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్ బి ఫార్మసీ కోర్సు అందుబాటులో ఉందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యూనివర్సిటీ క్యాంపస్ లోని బి ఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందవచ్చునని వీసీ ఆచార్య కె.పద్మరాజు తెలిపారు. బుధవారం యూనివర్సిటీలో దీనికి సంబంధించిన వివరాలను వీసీ తెలియజేశారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ బీఫార్మసీ కోర్సు కు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోద లభించుందని అన్నారు. దీని ద్వారా ఆదికవి నన్నయ యూనివర్సిటీ బీఫార్మసీ కోర్సు లో చేరేందుకు ఏపీ ఇఎపి సెట్ వెబ్ ఆప్షన్స్ లో విద్యార్థులు ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. తాడేపల్లిగూడెం ప్రాంగణంలో నూతన భవనంలో బీఫార్మసీ కోర్సు నడపబడుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అధునాతన లాబరేటరీ వంటి వసతులు ఉన్నాయని తెలియజేశారు. ఈనెల 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చునని చెప్పారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ లో బీఫార్మసీ కోర్సు చేయాలనుకునే విద్యార్థులకు ఇది చక్కని అవకాశమని తెలియజేశారు.