తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా!

 తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా!

మొన్నటివరకూ జాతీయ జట్టు కోసం క్రికెట్ ఆడి శభాష్ అనిపించుకున్నాడు. సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు పరువు నిలిపాడు హార్దిక్ పాండ్యా. టీ20ల్లోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. అయినా తన మంచి మనసు చాటుకుంటూ జట్టులో అరంగేట్రం చేసిన బౌలర్, యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్‌ చేతికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ అందించి పెద్ద మనసు చాటుకున్నాడు పాండ్యా.

అదేంటీ.. గతంలో మనం చూసిన పాండ్యా వేరు, ఇప్పుడు కనిపిస్తున్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వేరు అని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.

దీనంతటికి మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రయ్యాడు. తండ్రి అయిన తర్వాత హార్దిక్ పాండ్యా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కొన్ని రోజుల కిందటి వరకు భారత జట్టు కోసం చెమటోడ్చిన క్రికెటర్లలో పాండ్యా ఒకడు. ప్రస్తుతం పాండ్యా షేర్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related post