ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు టీమిండియా జట్టులో మార్పులు.

 ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు టీమిండియా జట్టులో మార్పులు.

గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ కోసం దుబాయ్‌ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు నిర్విరామంగా క్రికెట్‌ ఆడుతున్న నేపథ్యంలో కొందరు ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్ సుందర్‌లతో సహా మొత్తం 8 మంది ఆటగాళ్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. కరోనా బ్రేక్ అనంతరం క్రికెట్ రిస్టార్ట్ అయినప్పటి నుంచి టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్‌కే పరిమితం కావడం వల్ల తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదమున్నందున ఈమేరకు నిర్ణయం​ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Related post