సైనికుల కోసం “సోలార్ మిలటరీ టెంట్”.

 సైనికుల కోసం “సోలార్ మిలటరీ టెంట్”.

అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలలో గల సైనికులు చాలా రకాల కష్టాలను పడుతూ ఉంటారు. ముఖ్యంగా యుద్ధ వాతావరణ సమయంలో అనేక స్వంత సవాళ్లను ఎదురుకొంటూ ఉంటారు. మందుగుండు సామగ్రి భద్రత, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు మరియు అధికంగా వీచే గాలి వంటి సమస్యలతో సైనికులు తరచూ పోరాడుతూ ఉంటారు. రెగ్యులర్ సామాగ్రి అవసరాలే కాకుండా భారీ శీతాకాలపు సమయాలలో వాటిని తట్టుకోవడానికి వాటికి సంబదించిన గేర్లను మరియు గుడారాలను బెటాలియన్లు తీసుకెళ్లడం ఎంతగానో అవసరం. వీటిలో ప్రధానంగా చలి యొక్క తాపనాన్ని తగ్గించడానికి కిరోసిన్ భారీ మొత్తంలో అవసరం ఉంటుంది. ముఖ్యంగా మారుమూల కొండ ప్రాంతాలలో ఖర్చు, శ్రమ మరియు లాజిస్టిక్స్ భారీగా ఉన్న కారణంగా వీటికి ప్రత్యాన్మాయం వైపు అడుగులు వేస్తున్నారు.

వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.


వాంగ్‌చుక్ సోలార్ మిలిటరీ టెంట్స్

సైనికులు పడుతున్న ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని లడఖ్‌కు చెందిన ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్ తన యొక్క పరిజ్ఞానంతో సరికొత్త స్వదేశీ ఆవిష్కరణను కనుగొన్నారు. సౌరశక్తితో మనకు కావలసిన ఉష్ణోగ్రతను అందించే గుడారాలను కనుగొన్నారు. వీటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడం కూడా చాలా సులభం. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గుడారాలు తాపనాన్ని అందించడానికి ఎటువంటి సౌర ఫలకాలను లేదా బ్యాటరీలను ఉపయోగించవు. ఈ కొత్త ఆవిష్కరణలో పగటిపూట సూర్యుడి నుండి వచ్చే వేడిని “హీట్ బ్యాంక్ వాల్” పై పట్టుకోవడం మీద పూర్తిగా దృష్టి పెడుతుంది. తరువాత రాత్రిపూట టెంట్ లోపల వేడిగా ఉంటుంది. ఈ గుడారాలు సమర్థవంతమైన ఇన్సులేషన్ మీద ఆధారపడతాయి కావున సూర్యోదయం మరియు సూర్యాస్తమయం దిశ ప్రకారం వాటిని సమలేఖనం చేయడం చాలా ముఖ్యం. డేరా లోపల మనిషికి సౌకర్యవంతమైన 12 నుండి 25 డిగ్రీల సెల్సియస్ అన్ని సమయాల్లో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. మేఘావృతం కారణంగా సూర్యరశ్మి పరిమితంగా ఉన్నప్పుడు స్టాండ్బై కిరోసిన్ బాయిలర్ అందించబడుతుంది. అది హీట్ బ్యాంక్ వాల్ లోని నీటిని వేడి చేస్తుంది.

సోలార్ మిలిటరీ టెంట్స్ ఫీచర్స్

వాంగ్‌చుక్ కొత్తగా తయారుచేసిన సోలార్ టెంట్స్ ద్వారా రాత్రి సమయాలలో గుడారం లోపల సమర్థవంతమైన తాపనను పొందవచ్చు. దీని యొక్క సాయంతో కిరోసిన్ వాడకాన్ని సమర్థవంతంగా తగ్గించడం, గుడారాలను పోర్టబుల్ చేయడం, అగ్ని ప్రమాదాలను, ఖర్చులను తగ్గించడం మరియు ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని పరిష్కరించడం వంటి వాటిని అధిగమించవచ్చు. హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లో చదువుకున్న వాంగ్‌చుక్ అధిక-ఎత్తులో ఉన్న లడఖ్ ప్రాంతంలోని ప్రజల జీవనశైలిని మెరుగుపరచడానికి ప్రత్యేకమైన తక్కువ-ధర పరిష్కారాలను రూపొందించడంపై దృష్టి పెడుతున్న సందర్బంగా దీనిని కనుగొన్నారు.

సోలార్ టెంట్స్ లివింగ్ కపాసిటీ

సోలార్ టెంట్స్ అనేవి 10 మందికి వసతిని కల్పించే విదంగా మరియు రెండు భాగాలుగా విభజించబడి ఉంటాయి. ఇందులో వెంటిలేషన్ విషయానికొస్తే ఇందులో 10 మందికి తగినంత ఆక్సిజన్ లభిస్తుందా అన్నదే ఇంకా పరీక్షిస్తున్నట్లు వాంగ్‌చుక్ తెలిపారు. అవసరమైతే ఆర్టిఫియల్ హీట్ రికవరీ వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు వాంగ్‌చుక్ చెప్పారు.

సోలార్ మిలిటరీ టెంట్స్ ధర

పారదర్శకంగా మరియు పగటిపూట డేరా లోపల సూర్యరశ్మిని అనుమతించే “గ్రీన్హౌస్” విభాగం కూడా ఉంది. ఇందులో నిద్రించడానికి ఒక ప్రత్యేకమైన గది కూడా ఉంది. డేరా లోపాల గల రెండు ప్రాంతాలు ఇన్సులేట్ పోర్టబుల్ వాల్ ద్వారా విభజించబడ్డాయి. డేరా యొక్క ప్రతి భాగం 30 కిలోల కన్నా తక్కువ బరువును కలిగివుంటుందని వాంగ్చుక్ పేర్కొన్నాడు. ఈ రకమైన టెంట్ ను అన్ని రకాల కొండ ప్రాంతాలలోను ఏర్పాటు చేయవచ్చు. ప్రతి గుడారానికి మొత్తంగా 40 భాగాలు ఉన్నాయి. ఈ గుడారాలను రూ.5 లక్షల వ్యయంతో తయారుచేసినట్లు తెలిపారు

Related post