గూగుల్ యాప్ లో సరికొత్త ఫీచర్.

 గూగుల్ యాప్ లో సరికొత్త ఫీచర్.

ప్రపంచంలో ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఏదో ఒక సరికొత్త టెక్నాలజీ కనుగొనబడుతూ ఉంటుంది. అలా కనుగొనబడిన అధునాతన టెక్నాలజీ మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూ, అందరినీ అబ్బుర పరుస్తూనే ఉంటుంది. అలా కనుగొనబడిన సరికొత్త టెక్నాలజీ గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం… అదేనండి మన google Messages App ఒక టెక్నాలజీ సదుపాయాన్ని మనకి కల్పిస్తోంది. రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో, పాతవన్నీ పోయి, కొత్తవి అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మొబైల్ వంటివి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచీ ఉత్తరాలు మాయమైపోయాయి. మొబైల్ లోనే మెసేజ్ లు చేరవేసే టెక్నాలజీ వచ్చేసింది.

సాధారణంగా, టెలిగ్రామ్,వాట్సాప్ మెసెంజర్ తదితర యాప్ లు వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

అంతేకాకుండా వివిధ సంఘాలు, సంస్థలు సైతం సపరేటు గా గ్రూప్లను ఏర్పాటు చేసుకుని సమాచారాన్ని అన్ని స్థాయిల వారికి సింపుల్ క్లిక్ తో పంపిణీ చేస్తున్నారు. అయితే మెసేజ్ ను నిర్ణీత సమయానికి పంపించేలా సెట్ చేయగలిగే సామర్థ్యం గల యాప్ లు ఇప్పటివరకూ ఏవీ రాలేదు. యూజర్లకు ఇది ఒక అసౌకర్యంగా మారింది.

ఇదిలా ఉండగా దీనిని గమనించిన గూగుల్ (Googel Message Sechedul ) ‘గూగుల్ మెసేజ్ షెడ్యూల్ లింగ్ ‘ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మనం మెసేజ్ ను టైప్ చేసి, అవతల వ్యక్తికి పంపాల్సిన సమయాన్ని ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ యాప్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న అనంతరం యాప్ ఓపెన్ చేయగానే ఈ యాప్ డిఫాల్ట్ యాప్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. అనంతరం పాత మెసేజ్ యాప్ లో ఉన్న మెసేజ్ లు అన్ని ఇందులోకి వస్తాయి. అయితే ఇందులో ఎలా షెడ్యూల్ చేయాలో..? ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

కింద కుడివైపు ఉన్న మెసేజ్ ఐకాన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మెసేజ్ పంపాల్సిన వారి నెంబర్ ఎంటర్ చేసి మెసేజ్ బాక్స్ లో మనం పంపాలనుకున్న మెసేజ్ ను టైప్ చేయాలి. అనంతరం ఎస్ఎంఎస్ సెండ్ బటన్ పై..కొన్ని సెకన్లపాటు లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకు షెడ్యూల్ సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేసిన వెంటనే మనం ఏ సమయానికి ఆ మెసేజ్ పంపాలి అనుకున్నాము అక్కడ టైమింగ్ సెట్ చేసుకోవాలి. ఒకవేళ మనం షెడ్యూల్ చేసిన సమయాన్ని కూడా మార్చుకునే సదుపాయం కూడా ఉంది.

Related post