‘జియో బుక్’ పేరుతో జియో ల్యాప్ టాప్స్ తీసుకొస్తున్న జియో సంస్థ.

 ‘జియో బుక్’ పేరుతో జియో ల్యాప్ టాప్స్ తీసుకొస్తున్న జియో సంస్థ.

ఇండియాలో 4G సర్వీసులను ఉచితంగా పరిచయం చేసి అందరిని ఆశ్చర్యపరిచిన రిలయన్స్ జియో, ఇప్పుడు మరొక వార్త ద్వారా అందిరిని మరోక్కసారి సర్ప్రైజ్ చెయ్యచ్చని తెలుస్తోంది. ముందుగా, 4G సర్వీస్ లను తరువాత తక్కువ ధరకే 4G ఫోన్లను ప్రకటించిన జియో మరొక కొత్త ప్రోడక్ట్ ని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు పక్కాగా తెలుస్తోంది. అదే, జియో ల్యాప్ టాప్స్.

XDA డెవలపర్స్ ఈ ల్యాప్ టాప్ రాక గురించి కీలకమైన సమాచారాన్ని వెల్లడించింది. దీని ప్రకారం, చాలా తక్కువ ధరకే అందరికి అందుబాటులో ఉండేలా ‘జియో బుక్’ పేరుతో జియో ల్యాప్ టాప్స్ తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సూచింది. వీటి ధరను దృష్టిలో పెట్టుకొని, విండోస్ OS తో కాకుండా గూగుల్ OS తో పనిచేసే విధంగా వీటిని తయారు చెయ్యవచ్చని చెబుతోంది.

Related post