మంత్రి కేటీఆర్ పై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఫైర్.

 మంత్రి కేటీఆర్ పై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఫైర్.

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసమే కేటీఆర్ విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తిస్తా అన్నట్లు ఉంది కేటీఆర్ మాటలు ఉన్నాయని ఎద్దేశాచేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో చాలా సమస్యలున్నాయని, ముందు వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిజాం షుగర్‌ను అమ్ముకున్న వీరు విశాఖ ఉక్కు మీద ఉద్యమం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని చూస్తేనే టీఆర్ఎస్ నేతల లాగులు తడుస్తాయని ఆయన ఎద్దేవాచేశారు. వీళ్లు కేంద్రం మీద పోరాటం చేస్తాం అంటే సీమాంధ్రులు నమ్మరని, కేటీఆర్ మాటలు నమ్మి ఓటు వేయడానికి ఆంధ్ర సెటిలర్లు అమాయకులు కారని చెప్పారు.

  • ఉద్యోగులు ఆత్మ గౌరవంతో ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని దాసోజు శ్రావణ్ పిలుపునిచ్చారు.

Related post