• November 29, 2021

శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రదాడి. దాడిలో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు.

 శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రదాడి. దాడిలో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు.

శ్రీనగర్ : శ్రీనగర్‌లోని లవాయ్‌పోరా సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు‏ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. ఈ దాడికి పాల్పడింది లష్కరే తోయిబా అని సీఆర్పీఎఫ్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ దాడిలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించామని ఐజీ తెలిపారు. ఈ దాడి జరిగిన తర్వాత సీఆర్పీఎఫ్ అధికారులు లవాయ్‌పోరా ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు

Related post