శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చేగుంట లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..

శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చేగుంట లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు 2023 సంవత్సర అనుభవాలను మధుర జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఉపాధ్యాయులు విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం 2024 కు స్వాగతం పలుకుతూ విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పాటలు డాన్సులు చేసి అలరించారు. పాఠశాలలో ఇటీవల నిర్వహించిన పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చేగుంట లయన్స్ క్లబ్ ప్రతినిధులు మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ లింగమూర్తి ప్రధానోపాధ్యాయులు వివేకవర్ధన్ వైస్ ప్రిన్సిపల్ రెహమాన్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.