మయన్మార్‌లో 50 మంది ఆందోళనకారులను కాల్చి చంపిన సైన్యం.

 మయన్మార్‌లో 50 మంది ఆందోళనకారులను కాల్చి చంపిన సైన్యం.

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తన నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. వారిని అదుపు చేసేందుకు నేడు సైన్యం జరిపిన కాల్పుల్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు ఎలాంటి అపాయం జరగకుండా మిలటరీ కాపాడుతుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేసుందని పాలిత నేత జుంటా చెప్పిన మరునాడే ఆందోళనకారులపై సైన్యం బుల్లెట్ల వర్షం కురిపించడం గమనార్హం.

ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం దేశాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి సైన్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా అతిపెద్ద నగరాలైన యాంగూన్, మాండలే సహా ఇతర నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సైన్యం చర్యను పదవీచ్యుతులైన చట్టసభ్యులు తీవ్రంగా నిరసించారు. సైన్యానికి ఇది సిగ్గు చేటైన విషమయని జుంటాకు వ్యతిరేకంగా ఏర్పడిన చట్టసభ్యుల గ్రూపు సీఆర్‌పీహెచ్ అధికార ప్రతినిధి డాక్టర్ సెసా అన్నారు.

Related post