భారత మార్కెట్లోకి మోటో జి 100 స్మార్ట్ ఫోన్ లాంఛ్.

 భారత మార్కెట్లోకి మోటో జి 100 స్మార్ట్ ఫోన్ లాంఛ్.

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ మోటరోలా ఈ మధ్య కాలంలో వరుస స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ యూజర్లను అట్రాక్ట్​ చేస్తోంది. తాజగా, మోటో జి 100 స్మార్ట్​ఫోన్​ను లాంఛ్​ చేసి అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది. అందరూ ఊహించినట్లుగానే ఈ ఫోన్ మోటరోలా ఎడ్జ్ ఎస్​కు రీబ్రాండ్​గా అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది. ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. దీనిలో డ్యూయల్ పంచ్-హోల్ కెమెరాలు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ కెమెరా, ప్రింట్ సెన్సార్ కెమెరాలను అందించారు. మోటో జి 100 స్పెసిఫికేషన్స్​ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్​ఫోన్​ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్​ ఎఫ్‌హెచ్‌డి + డిస్​ప్లేలను అందించారు.

  1. అట్రాక్టివ్​ ఫీచర్లతో వస్తోన్న మోటో జి 100 స్మార్ట్​ఫోన్​ ధర, ఫీచర్లు, లభ్యత తదితర వివరాలను పరిశీలిద్దాం.

    మోటో జి 100 బేస్ మోడల్ ధర EUR 499.99 (సుమారు రూ. 42,800) నుండి ప్రారంభమవుతుంది. అయితే, దీని హై-ఎండ్ వేరియంట్ ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇది ఇరిడెసెంట్ స్కై, ఇరిడెసెంట్ ఓషన్, స్లేట్ గ్రే వంటి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ తొలుత యూరప్, లాటిన్ అమెరికన్ మార్కెట్లలోకి విడుదల కానుంది. ఆ తర్వాతే భారత మార్కెట్​లో లాంఛ్​ అవుతుంది.

    మోటో జి 100 స్మార్ట్​ఫోన్​లో 6.7 -అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్​ ఎల్‌సిడి డిస్‌ప్లేను అందించారు. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2520 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్​ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్​ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 SoCతో పనిచేస్తుంది. ఇది అడ్రినో 650 GPU GPU తో జతచేయబడుతుంది. దీనిలో 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్​ని అందించారు. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను మరింత విస్తరించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11తో పనిచేస్తుంది. 20W టర్బో చార్జింగ్‌ కలిగిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌లను కూడా దీనిలో అందించారు.

    ఇక కెమెరాల విషయానికొస్తే.. మోటో జి 100 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను అందించారు. వాటిలో f / 1.7 ఎపర్చర్ తో కూడిన 64 ఎంపీ ప్రాథమిక సెన్సార్ కెమెరా, f/ 2.2 ఎపర్చర్ తో కూడిన 16 ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP డెప్త్ లెన్స్ కెమెరాలను అందించారు. దీని ముందు భాగంలో, 16MP ప్రాధమిక సెన్సార్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ కెమెరాలను అందించారు. ఇక, కనెక్టివిటీ ఫీచర్ల విషయాకి వస్తే.. 5G SA / NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, NFC, USB టైప్-సి వంటి ఫీచర్లను చేర్చింది. ఇది 168.38 x 73.97 x 9.69mm డైమెన్షన్స్​, 207 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. పోర్ట్రెయిట్ లేదా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఉంచే ‘రెడీ ఫర్ డాక్’ను కూడా దీనిలో అందించింది. ఇది మీ ఫోన్​ను హీటవ్వకుండా చేస్తుంది

Related post