‘వైల్డ్ డాగ్‌’ సినిమా సెన్సార్ పూర్తి.

 ‘వైల్డ్ డాగ్‌’ సినిమా సెన్సార్ పూర్తి.

కింగ్, అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. ఇది మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రమిది. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్‌ 2న విడుదల చేస్తున్నారు. నాగార్జున జోడీగా దియా మీర్జా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. హైదరాబాద్‌ గోకుల్‌ చాట్‌ సహా దేశంలో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ల కేసును ఎన్‌ఐఏ టీమ్‌ను ఎలా చేధించిందనే కథాంశంతో ‘వైల్డ్‌డాగ్‌’ సినిమా తెరకెక్కింది.

సినిమా హైదరాబాద్‌ సహా హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంది. ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా యాక్షన్ రోల్ చేస్తున్నారు. క్రిమినల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వల్ల సినిమాలో ఆయనను ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు.

Related post