‘‘వకీల్‌ సాబ్’’ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకలకు అనుమతి నిరాకరించిన హైదరాబాద్ పోలీసులు.

 ‘‘వకీల్‌ సాబ్’’ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకలకు అనుమతి నిరాకరించిన హైదరాబాద్ పోలీసులు.

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ నటించిన ‘‘వకీల్‌ సాబ్’’ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకలకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించ. ఏప్రిల్ 3న యూసుఫ్‌గూడలోని పోలీసు బెటాలియన్ మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు దాదాపు 5 నుంచి 6 వేల మంది పవన్ కల్యాణ్ అభిమానులు హాజరుకానున్నారు. ప్రీరిలీజ్ వేడుకల కోసం జే మీడియా ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులను అనుమతి కోరారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రీ రిలీజ్‌ వేడుకలకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చిచెప్పారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ‘వకీల్ సాబ్’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను మరింత భారీగా చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అయితే నిర్మాతలు అనుకున్న రీతిలో ప్రమోషన్స్ చేసేందుకు కోవిడ్ నిబంధనలు అడ్డంకిగా మారాయి.

Related post