ఉగాది పండుగకు ట్రైలర్ తో రాబోతున్న “టక్ జగదీష్”.

 ఉగాది  పండుగకు ట్రైలర్ తో రాబోతున్న “టక్ జగదీష్”.

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నాని సరసన నటించారు. సమ్మర్ కానుకగా ఈ సినిమాని ఏప్రిల్ 23న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘టక్ జగదీష్’ చిత్ర బృందం ప్రమోషన్స్‌ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ‘పరిచయ వేడుక’ పేరుతో రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఈవెంట్ కూడా సక్సెస్ అయింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్‌కి అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 13న థియోట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా వెల్లడిస్తూ ఒక పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్‌ని వైజాగ్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్

Related post