పబ్‌జీ గేమ్ మరో సంచలన నిర్ణయం. పబ్జి యూజర్లకు బ్యాడ్ న్యూస్.

 పబ్‌జీ గేమ్ మరో సంచలన నిర్ణయం. పబ్జి యూజర్లకు బ్యాడ్ న్యూస్.

మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ పబ్‌జీ మరో సంచలన నిర్ణయం పబ్‌జీ మరో సంచలన నిర్ణయంతీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 29 నుంచి లో-ఎండ్‌ వెర్షన్‌ పబ్‌జీ లైట్‌ను మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎంట్రీ లెవల్‌ మొబైల్‌ డివైజ్‌ల కోసం 2019లో పబ్‌జీ లైట్‌ను తీసుకొచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం పబ్‌జీ మొబైల్‌తో పాటు పబ్‌జీ మొబైల్‌ లైట్ పైనా నిషేధం విధించింది.

ప్రపంచవ్యాప్తంగా పబ్‌జీని 600 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకోగా ప్రస్తుతం 50 మిలియన్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. భారత్‌లోనే 33 మిలియన్ల మంది ఉన్నారు. భారత్‌లో పబ్‌జీని మళ్లీ తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తుండగా, బ్యాటిల్‌ రాయల్‌ గేమ్‌ కోసం గేమింగ్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘దురదృష్టవశాత్తు, సుదీర్ఘ చర్చల అనంతరం ఈ సర్వీసును మూసివేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నాం. మా ప్రయాణం ముగిసే సమయం ఆసన్నమైంది. ఏప్రిల్‌ 29, 2021 నుంచి పబ్‌జీ లైట్‌ సేవలు ముగుస్తుందని మీకు తెలుపుతున్నందుకు మేమెంతో చింతిస్తున్నామని’ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

పబ్‌జీ లైట్ సర్వీసును మూసివేసిన తర్వాత కూడా తదుపరి ప్రకటన వచ్చే వరకు పబ్‌జీ లైట్‌ ఫేస్‌బుక్‌ పేజీ కొనసాగనుంది. కరోనా మహమ్మారి ప్రపంచమంతటికి వ్యాపించిన ప్రారంభ దశలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆన్‌లైన్‌ గేమ్‌ల్లో పబ్‌జీ లైట్‌ ఒకటి.

Related post