ఏపీలో ముగిసిన టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం.

 ఏపీలో ముగిసిన టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం.

ఏపీలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం ముగిసింది. రాష్ట్ర పరిషత్‌ ఎన్నికలపై చంద్రబాబు నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే తమ అభిప్రాయాలను తెలిపిన టీడీపీ నేతలు.. ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ నేతలు సూచించారు. అభ్యర్థులు కూడా పోటీ నుంచి వెనక్కి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల బహిష్కరణపై క్యాడర్‌కు, అభ్యర్థులకు వివరించాలని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఎన్నికల బహిష్కరణపై పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనుంది.

అయితే కాగా, ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్‌గా నీలం సాహ్నీ ఈనెల 1న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎస్‌ఈసీతో భేటీ అయ్యారు. పరిషత్‌ ఎన్నికలపై చర్చించారు. కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరారు. దీంతో ఈ ఎన్నికల విషయమై ఎస్‌ఈసీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై చర్చించారు

Related post