• October 23, 2021

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదులు హతం.

 జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదులు హతం.

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అటు ఇద్దరు పౌరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని కాకాపోరా ప్రాంతంలో భద్రతా దళాలు.. ఉగ్రవాదుల ఉనికిని తెలుసుకుని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా తిప్పికొట్టిన భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పౌరులకు కూడా తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. కాగా, పుల్వామా ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఇష్రత్ జాన్ (25), గులాం నబీ దార్ (42)లను స్థానికులుగా గుర్తించామని పోలీసు అధికారి తెలిపారు.

Related post