‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి అజయ్ దేవ్ గన్ పోస్టర్ విడుదల.

 ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి అజయ్ దేవ్ గన్ పోస్టర్ విడుదల.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో… డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ “RRR Movie”. ఈ సినిమాను దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‏తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్ గణ్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. పలువురు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుతున్నాడు జక్కన్న. భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 13 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. (Ajay Devgan)

ఇందులోని హీరోహీరోయిన్ల పుట్టినరోజుల సందర్బంగా వారి పోస్టర్స్ విడుదల చేస్తూ వస్తున్నాడు రాజమౌళి. శుక్రవారం అజయ్ దేవ్ గణ్ పుట్టిన రోజు సందర్భంగా అజయ్ మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో అజయ్.. పవర్ ఫుల్ లుక్‏లో కనిపించాడు. ఇక ఈ మోషన్ పోస్టర్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు గురువుగా, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇక జక్కన్న భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Related post