ప్రచారంలో టీడీపీ కొత్త వ్యూహం.

 ప్రచారంలో టీడీపీ కొత్త వ్యూహం.

టీడీపీకి చెందిన కృష్ణా జిల్లా నందిగామ జడ్పీటీసీ అభ్యర్థి సోషల్ మీడియాలో వినూత్న ప్రచారం సాగిస్తున్నారు. నందిగామ టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి సజ్జా అజయ్.. వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. తాను ఆంధ్ర రాష్ట్రం కోసం, రాజధాని కోసం 14 రోజులు జైలుకు వెళ్లానన్నారు. రైతులు పడుతున్న కష్టాలపై పోరాడితే అక్రమ కేసులు పెట్టారన్నారు. తన అవసరాల కోసం కండువాలు మార్చే వ్యక్తికి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తాను కావాలో, వైసీపీ అభ్యర్థి కావాలో తేల్చుకోవాలన్నారు.

Related post