విజయసాయిరెడ్డి పై టీడీపీ నేత చినరాజప్ప ఫైర్.

 విజయసాయిరెడ్డి పై టీడీపీ నేత చినరాజప్ప ఫైర్.

గతంలో జయలలిత, జ్యోతిబసు వంటి వారు ఎన్నికల్ని బహిష్కరించారని టీడీపీ నేత చినరాజప్ప అన్నారు. వాళ్లు కార్యకర్తల్ని కాపాడుకొని సీఎంలు అయ్యారని ఏ2 విజయసాయిరెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. మీ ఏ1 కూడా అసెంబ్లీని రెండేళ్లు బహిష్కరించిన విషయం మరిచారా?, విజయసాయికి దొంగ లెక్కలు తప్ప చరిత్ర జ్ఞానం ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ప్రజాస్వామ్య విలువలు ఏం తెలుసన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దొంగ, పోలీసు ఒక్కటయ్యారని విమర్శించారు.

Related post